రాష్ట్రంలో ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ.. ఈనెల 27న గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరు సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన... ఈనెల 26న సీపీఐ 95వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు మున్సిపల్ కార్యాలయం నుంచి లాడ్జి సెంటర్ అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. దిల్లీలో రైతుల చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా.. రైతులకు న్యాయం జరిగేవరకు ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.
ఈ నెల 27న గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన - గుంటూరు జిల్లాలో నిరసన
ఈ నెల 27న గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలో ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ... ఆందోళన చేపడతామని వివరించారు.
సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్