గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ముంబయిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజగృహంపై గుర్తుతెలియని కొందరు దుండగులు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన చర్య అని మండిపడ్డారు.
అంబేడ్కర్ గృహంపై దాడిని ఖండిస్తూ నిరసన - గుంటూరు జిల్లా
ముంబయిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజగృహంపై దాడి హేయమైన చర్య అంటూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు.
అంబేద్కర్ మ్యూజియం పై దాడిని ఖండిస్తూ చిలకలూరిపేటలో నిరసన
చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముంబయిలోని దాదర్ హిందూ కాలనీలో ఉన్న రాజగృహాలోని మూడంతస్థుల ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు వరండాలో ఉన్న పూల కుండీలను, కిటికీ అద్దాలు పగలగొట్టడం, కొన్ని గ్రంథాలను ధ్వంసం చేయటం దారుణమన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.