ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ గ్రామస్థుల ఆందోళన - గుంటూరు జిల్లా తాజా క్రైం వార్తలు

గుంటూరు జిల్లా గ్రామాలపాడు గ్రామస్థులు.. స్థానిక జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రహదారిపై ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.

protest for justice in accident case at gramalapadu
జాతీయ రహదారిపై ధర్నా

By

Published : Apr 20, 2021, 1:05 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు వద్ద జాతీయ రహదారిపై గ్రామస్థులు బైఠాయించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మృతుడి బంధువులు, గ్రామస్థులు జాతీయ రహదారిపై రాత్రి సుమారు 2 గంటలు వరకు ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులను ఆదుకునేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details