ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PROTEST : పోలీసులు కొట్టారంటూ మౌనదీక్ష.. న్యాయం చేయాలని వినతి

గుంటూరు జిల్లా అడవులదీవి గ్రామంలో ఓ వ్యక్తి మౌనదీక్షకు దిగాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు.. పోలీసులు కొట్టారని, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

పోలీసులు కొట్టారంటూ మౌనదీక్ష
పోలీసులు కొట్టారంటూ మౌనదీక్ష

By

Published : Dec 26, 2021, 10:04 PM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామానికి చెందిన గుడిపల్లి కృష్ణరావుకు.. పొలం విషయంలో యేమినేని శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాదం నడుస్తోంది. సమస్య పరిష్కారానికి ఇరువురూ పొలీసులను ఆశ్రయించారు. అయితే.. తన ఫిర్యాదుపై పోలీసులు పట్టించుకోకపోవడంతో.. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశానని కృష్ణారావు తెలిపాడు.

తమను కాకుండా పై అధికారులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ అడవులదీవి ఎస్సై రామకృష్ణ తనను తీవ్రంగా కొట్టారని కృష్ణారావు ఆరోపించాడు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టాడు. సదరు ఎస్సైపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. కృష్ణారావును పోలీసులు కొట్టలేదని రేపల్లె రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. అంతేకాకుండా.. కృష్ణారావుపై రౌడీ షీట్ ఉందని, రెండు హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్సై వివరించారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details