ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో బీసీ సంక్షేమ సంఘాల నేతల నిరసన ప్రదర్శన - protests in guntur news

గుంటూరులో బీసీ సంక్షేమ సంఘాల నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా ఆందోళన చేపట్టారు. రేపు నిర్వహించనున్న భారత్​ బంద్​ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

protest
బీసీ సంఘాల నేతల నిరసన ప్రదర్శన

By

Published : Dec 7, 2020, 6:58 PM IST

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ గుంటూరులో బీసీ సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్​ చేశారు. రైతు హక్కులను కాలరాసేలా సర్కారు కొత్త చట్టాలను రూపొందించిందన్నారు.

జిల్లాలోని లాడ్జి సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంకుశ విధానాలను అవలంబిస్తుందన్నారు. రైతుల హక్కుల కోసం తలపెట్టనున్న భారత్ బంద్​లో స్వచ్ఛదంగా పాల్గొని జయప్రదం చేయాలని యువజన విభాగం రాష్టాధ్యక్షుడు క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:తుళ్లూరులో రోడ్డుపై ఆందోళన విరమించిన రైతులు

ABOUT THE AUTHOR

...view details