ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి' - గుంటూరు జిల్లా తాజా వార్తలు

కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా సీపీఐ కార్యాలయంలో దీక్షలు చేపట్టారు. కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్​ చేశారు..

గుంటూరులో సీపీఐ దీక్షలు
గుంటూరులో సీపీఐ దీక్షలు

By

Published : Jun 17, 2021, 9:12 PM IST

కరోనాతో మృతిచెందిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను అజయ్ కుమార్ ప్రారంభించారు. కరోనాతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారని, ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details