ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Protest: 'మా ఇళ్లను కూల్చేందుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నారు' - మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్లకు వ్యతిరేకంగా నిరసన

అభివృద్ధి పేరుతో తమ ఇళ్లను కూల్చేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని భాగవతులవారి వీధిలో స్థానికులు ధర్నా చేపట్టారు. రహదారి విస్తరణ పేరుతో వీధిలోని సుమారు 100 ఇళ్లకు నగరపాలక సంస్థ అధికారులు మార్కింగ్ వేయగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

'మా ఇళ్లను కూల్చేందుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నారు'
'మా ఇళ్లను కూల్చేందుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నారు'

By

Published : Feb 11, 2022, 8:39 PM IST

ఇళ్లను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటాం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని భాగవతులవారి వీధిలో స్థానికులు ధర్నా చేపట్టారు. రహదారి విస్తరణ పేరుతో.. భాగవతులవారి వీధిలో సుమారు 100 ఇళ్లను తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు మార్కింగ్ వేయగా.. స్థానికులు అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి పేరుతో తమ ఇళ్లను కూల్చేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు తొలగించవద్దని గతంలో ఎమ్మెల్యేకు లేఖ ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా అక్కడే ఉంటున్నామని.. తమ ఇళ్లను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details