ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Prostitution gang: వ్యభిచార ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్​ - Prostitution gang caught in Guntur

గుంటూరులో వ్యభిచార ముఠా పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Prostitution gang
వ్యభిచార ముఠా

By

Published : Sep 24, 2021, 3:37 PM IST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను, ఇద్దరు విటులు అరెస్ట్ చేసినట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఎల్​బీఎస్​ అపార్ట్​మెంట్​లో లక్ష్మీ అనే మహిళ అద్దెకు ఉంటూ వ్యభిచారం నిర్వహిస్తోందని సమాచారంతో.. సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లామన్నారు. వ్యభిచారం చేస్తున్న మాధవి, విజయవాడకి చెందిన ఇద్దరు విటులు వడ్డే రామకృష్ణ, తాడబోయిన శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఫోన్ కాల్స్ ద్వారా పాత పరిచయాలు ఉన్న వారిని పిలిపించి అపార్టుమెంట్​లో లక్ష్మి అనే మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరపరుస్తున్నట్లు డీఎస్పీ జెస్సి ప్రశాంతి , సీఐ ప్రేమయ్య వివరించారు.

ABOUT THE AUTHOR

...view details