ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైసీపీ వాళ్ల సంస్థలే పక్క రాష్ట్రాల్లో ఉంటే.. ఇక్కడికి పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు..?' - APPF President on Global Investors Summit

Comments on Investments in AP: ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే వాతావరణం రాష్ట్రంలో ఉందా ఉంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ప్రశ్నించారు. పారిశ్రామిక సదస్సులు పెడుతున్నాం.. కంపెనీలను పిలుస్తున్నామని చెప్పే వైఎస్సార్సీపీ నాయకులు.. వారి అనుబంధ కంపెనీల అడ్రస్‌లు హైదరాబాదులో ఎందుకు ఉన్నాయో చెప్పాలన్నారు.

Professional Forum President
ఏపీపీఎఫ్ అధ్యక్షుడు

By

Published : Mar 2, 2023, 9:44 PM IST

Professional Forum Comments on Investments in AP: రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టే వాతావరణం ఉంచారా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు ప్రశ్నించారు. పారిశ్రామిక సదస్సులు పెడుతున్నాము.. కంపెనీలను పిలుస్తున్నామని చెప్పే వైఎస్సార్సీపీ నాయకులు వారి అనుబంధ కంపెనీల అడ్రస్​లు ఎందుకు హైదరాబాదులో ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆధార్ కార్డు, పాన్ కార్డు, కంపెనీలు హైదరాబాద్​లో ఉంటే.. ఇక్కడ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామనే మాటలు ఎవరిని మభ్య పెట్టడానికి అనే సందేహం వస్తుందన్నారు.

స్థిరత్వం లేని పారిశ్రామిక విధానాలతో, అధికారంలోకి రాకముందు ఒక రాజధాని, వచ్చాక మూడు రాజధానులు, ఇప్పుడు కాదు కాదు.. ఒకటే రాజధాని లాంటి రకరకాల విధానాలతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సాహసం చేస్తారా అని నిలదీశారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం 2000 కోట్లు నిధులు కూడా కేటాయించని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఏ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షిస్తుందన్నారు. రాబోయే బడ్జెట్లో పారిశ్రామిక ప్రోత్సాహకాలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

మీ కంపెనీలు పక్క రాష్ట్రాల్లో ఉంటే.. పెట్టుబడులు ఎలా వస్తాయి..?

"వైజాగ్​లో జరుగుతున్న ఇండస్టీ సమ్మిట్ ఎదైతే ఉందో.. దీనికి సంబంధించి.. పారిశ్రామికవేత్తలను పిలవడం. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్​లో ఉన్నాయా.. అసలు పరిశ్రమలు రావడానికి సానుకూలంగా ఉన్నాయా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో విభజన వలన, లోటు బడ్జెట్​ వలన పారిశ్రామిక అభివృద్ధి లేదు. వలసలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో.. పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే.. ఉద్యోగ కల్పన జరగుతుంది. ఆంధ్రప్రదేశ్​లో నిజంగానే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందా.. అలా జరిగితే వలసలు ఎందుకు పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది.. ఇంజనీరింగ్ పూర్తి అయిన వారిలో సుమారు లక్ష మంది విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. రాష్ట్రంలో యువత గౌరవంగా బతకలేరా.. ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు కల్పించలేక పోతోంది. ఈ ప్రశ్నలను యువత తరపున.. మేము అడుగుతున్నాము.

ఆంధ్రప్రదేశ్​లో పారిశ్రామిక అభివృద్ధి ఎందుకు లేదు. ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడుల వాతావరణం ఎందుకు లేదంటే.. ఒక్కొక్క కారణం మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి కారణం.. ఆంధ్రప్రదేశ్​లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. మూడు రాజధానుల అంశం తీసుకొచ్చింది. ఈ మూడు రాజధానుల వలన.. ఎంత ప్రభావం పడిందో.. జాతీయ స్థాయి మ్యాగజైన్​లో వేశారు. అప్పటికే పెట్టుబడులు పెట్టిన వాళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్​ పారిశ్రామిక పెట్టుబడులకు గొడ్డలి పెట్టువంటిదిగా మారింది. పెట్టుబడుల కోసం పలువురిని పిలుస్తున్నాం అని అంటున్నారు. వాటిని స్వాగతిస్తాం. కానీ మిమ్మల్ని వాళ్లు నమ్ముతున్నారా. ఎందుకంటే.. మీ కంపెనీ హైదరాబాద్​లో ఉంది. ప్రతిపక్ష నాయకుల కంపెనీలు కూడా హైదరాబాద్​లోనే ఉన్నాయి. మీ కంపెనీలే పక్క రాష్ట్రాల్లో ఉంటే.. మీరు ఎలా పారిశ్రామిక వేత్తలను పిలుస్తున్నారు. అదేవిధంగా మీరు కక్షపూరిత రాజకీయాలు చేస్తుంటే.. మిమ్మల్ని ఎవరైనా సరే ఎలా నమ్ముతారు". - నేతి మహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details