ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి లేదని.. తనకు తాను గుండు గీసుకున్న ఉపాధ్యాయుడు - గుంటూరు గుండు గీసుకున్న ఉపాధ్యాయుడు న్యూస్

ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర చెప్పలేనిది.. ఇప్పుడు అలాంటి గురువులే రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. కరోనాతో సామాన్యుడి నుంచి.. గొప్పవారు సైతం అవస్థలు పడాల్సిన పరిస్థితి. అలా ఓ ఉపాధ్యాయుడు రోడ్డుపైకి వచ్చాడు.

ఉపాధి లేదని తనకు తాను.. గుండు గీసుకున్న ఉపాధ్యాయుడు
ఉపాధి లేదని తనకు తాను.. గుండు గీసుకున్న ఉపాధ్యాయుడు

By

Published : Aug 30, 2020, 12:45 AM IST

పిల్లలను క్రమశిక్షణలో పెట్టి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో ఉపాధ్యాయల పాత్ర ఎంతో ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయుడు కరోనా మహమ్మారి కారణంగా నేడు రోడ్డున పడ్డాడు. ప్రైవేటు సంస్థలో 1998 నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన హేమచంద్ర బాబు 5 నెలలుగా ఏ పనిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పాఠశాలలు తెరవకపోవడంతో ఉన్న ఒక్క ఆధారాన్ని కోల్పోయాడు. తనుకు తానూ పశ్చాత్తాపంగా గుండు గీసుకున్నాడు. కనీసం తమ సంస్థ కానీ... ప్రభుత్వం కానీ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details