ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2020, 6:35 PM IST

ETV Bharat / state

'పది' పరీక్షలు పెట్టాలా..? వద్దా..? తేల్చుకోలేకున్న ప్రైవేటు యాజమాన్యాలు

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తలమునకలు అవుతున్నాయి. ప్రభుత్వం ఆగస్టు నెలలో పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన ఉందని స్కూలు యాజమాన్యాలు చెబుతున్నాయి.

private schools in ap in deilama about conduct 10th class exams in  andhra  in corona time
private schools in ap in deilama about conduct 10th class exams in andhra in corona time

పదో తరగతి పరీక్షల కోసం వచ్చిన విద్యార్థుల్లో ఎవరైనా కరోనా భారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రుల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థుల సత్తా ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. కరోనాకు భయపడే ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని..., మన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ల సంఘం ప్రతినిధి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details