Prisoners of Trial in Jail from Long Years :దళితుల ప్రేమకు తాను మాత్రమే అర్హుడినంటూ ఊకదంపుడు ప్రసంగాలతో విరుచుకుపడే జగన్ పాలనలో విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న వారిలో దళితులు, గిరిజనులే అధికం. నిమ్నవర్గాల బాంధవుడిలా గొప్పలు చెప్పుకొనే జగన్ జమానాలో అసలు నేరం చేశారో, లేదో తేలియకుండానే వేల మంది ఎస్సీ, ఎస్టీలు ఏళ్ల తరబడి జైలు గోడల మధ్యే నలిగిపోతున్నారు. కొందరు ఏకంగా తమపై మోపిన అభియోగాలకు పడే శిక్షకన్నా ఎక్కువగానే జైలులో ఉండిపోయారు.
YS Jagan Kodi Kathi case : జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అతను నేరం చేశాడో లేదో తెలియకుండానే ఇప్పటికీ ఐదేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఒకవేళ ఈ కేసులో తాను నిర్దోషి అని నిరూపితమైతే ఇంతకాలం కోల్పోయిన జీవితాన్ని, కాలన్ని ఎవరు వెనక్కి తీసుకొస్తారు.? తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యమవుతుందా? సకాలంలో విచారణ పూర్తి చేసి నేరం రుజువైతే చట్ట ప్రకారం శిక్షించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ నేరం చేశారో లేదో తేల్చకుండానే విచారణ ఖైదీలుగా ఏళ్ల తరబడి జైలు గోడల్లో మగ్గుతున్న ప్రతి ఐదుగురిలో ఇద్దరు దళిత, గిరిజనులే. 2019-22 మధ్య మొత్తం 20,724 మంది విచారణ ఖైదీలుగా జైళ్లలో గడపగా వీరిలో 8,531 మంది ఎస్సీ, ఎస్టీలే. అత్యధిక మంది కనీసం బెయిల్ పిటిషన్ వేసుకునే స్తోమత లేనివారే. కొంతమంది బెయిల్ దక్కినప్పటికీ అవసరమైన గ్యారంటీ సమర్పించే స్థితి లేక జైల్లోనే ఉండిపోతున్నారు.
Anarchies on Dalits: అధికార వైఎస్సార్సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య