Primary Health Centers Working Condition in AP: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటల ఆసుపత్రులుగా మార్చామని ప్రభుత్వం(YCP Government on PHCs) చెబుతున్నా.. వాటి పనితీరు మాత్రం ప్రశ్నార్ధకంగానే ఉంది. ఇవి మొక్కుబడి వైద్యానికే పరిమితమవుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా వైద్యులను నియమించామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా.. ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. అనవసర రిస్క్ అన్న ఉద్దేశంతో PHCల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు.. ప్రసవాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. చిన్నచిన్న సమస్యలకే కేసులను పెద్దాసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఐదు పడకలున్న పీహెచ్‌సీల్లోనూ(Primary Health Centers) ప్రసవాలు అతి స్వల్పంగా నమోదవుతున్నాయి. అక్కడ అనువైన వాతావరణాన్ని కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమవుతోంది. దీంతో ఏదో సాకు చెప్పి గర్భిణులను ఇతర ఆసుపత్రులకు పంపుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. గైనిక్, మత్తుమందు, చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.
"సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి.. ఆసుపత్రి ఏర్పాటు చేయండి" కార్మికులు
నిబంధనల ప్రకారం సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. కొన్ని చోట్ల మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండడం లేదు. రాత్రి సమయంలో స్టాఫ్ నర్సులు ఉండాలి. ఫోన్ చేస్తే వైద్యులు ఆసుపత్రికి వచ్చేలా ఉండాలి. కానీ.. చాలాచోట్ల ఈ పరిస్థితి లేదు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని పలు PHCలు, ఇతర ఆసుపత్రుల్లో వైద్యులు ఒక్కపూటకే పరిమితమవుతున్నట్టు తేలింది.
No Deliveries in Primary Health Centers: రాష్ట్రవ్యాప్తంగా 1146 PHCలు ఉన్నాయి. వీటిలో కేవలం 36 వేల 543 ప్రసవాలు నమోదయ్యాయి. అంటే నెలకు సగటున కేవలం 2.67శాతం మాత్రమే నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోఏప్రిల్ నుంచి జూన్ వరకు 6వేల 972 ప్రసవాలు నమోదయ్యాయి. అంటే నెలకు సగటు 2.03 శాతం మాత్రమే రికార్డయ్యాయి. 32.55శాతం అంటే 3వందల 73 PHCల్లో ఒక ప్రసవం కూడా జరగలేదు. 1 నుంచి 5 ప్రసవాలు 59.42 శాతం అంటే 6వందల 81 PHCల్లో జరగ్గా.. 4.10 శాతం అంటే 47 కేంద్రాల్లో పదికి పైగా జరిగాయి. కృష్ణా జిల్లాలో 50కు 35, తిరుపతి జిల్లాలో 58కి 37, గుంటూరు జిల్లాలో 25కు 15 PHCల్లో ఒక ప్రసవం కూడా జరగలేదు.
త్వరగా పీహెచ్సీ భవనాలు నిర్మించండి సారూ.. అనారోగ్యంతో బాధపడుతున్నాం..