గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఓ ఆలయ పూజారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని సుబ్రమణ్య స్వామి ఆలయ నిర్వాహకులు, పూజారి పిల్లారి సుబ్బారావు... ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయారు. సుబ్బారావు అల్లుడే అతడిని హత్య చేసిఉంటాడని పూజారి బంధువు వెంకన్న బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆత్మహత్య చేసుకునే ఇబ్బందికర పరిస్థితులు లేవని, అల్లుడే ఈ పని చేసి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. వెంకన్న బాబు ఫిర్యాదుతో పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.