ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు - ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు వార్తలు

గుంటూరు జిల్లాలో శారదా సొసైటీ ఆధ్వర్యంలో... మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. రోజురోజుకి పెరిగిపోతున్న ఎన్సీడిఎస్ వ్యాధులను నివారించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు శారదా సొసైటీ అధ్యక్షురాలు శారద తెలిపారు.

preventive health care medical camp at guntur district
మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు

By

Published : Jan 1, 2020, 10:26 AM IST

మహిళలకు ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు

గుంటూరు జిల్లా తెనాలిలో... శారదా సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోజురోజుకి పెరిగిపోతున్న ఎన్సీడీఎస్ వ్యాధులను నివారించేందుకు తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఇందిరా కాలనీ పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు వేల మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యాధుల బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన సూచనలు ఇచ్చారు. 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల స్త్రీలకు వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గుండెజబ్బులు, ఊపిరితిత్తులు... మొదలగు వ్యాధులను అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని శారదా సొసైటీ అధ్యక్షురాలు శారద తెలిపారు.
డాక్టర్ శారదా సొసైటీ ద్వారా ప్రభుత్వ సంస్థలను కూడా కలిపి ప్రివెంటివ్ కేర్ హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో బాగుందని స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కొనియాడారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details