రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ఏపీ పంచాయతీ పరిషత్ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు స్వాగతించారు. హైకోర్టు తీర్పు శుభ పరిణామని అన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. సర్పంచుల పదవీ కాలం పూర్తయి మూడేళ్లు దాటిందని... దీనివల్ల గ్రామాల్లోని ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు పూర్తిచేసి.. పల్లెల్లో కొత్త పాలన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యులు కావాలని వీరాంజనేయులు కోరారు.
ఎన్నికలపై హైకోర్టు తీర్పు శుభ పరిణామం: జాస్తి వీరాంజనేయులు - AP Panchayati Parishad President Jasti Veeranjaneyulu news
పంచాయతీ ఎన్నికలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర పంచాయతీ పరిషత్ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు స్వాగతించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
రాష్ట్ర పంచాయతీ పరిషత్ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు