రాష్ట్రవ్యాప్తంగా కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కొవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షించిన సీఎం... వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకున్న వారి అంశంపై ప్రధానంగా చర్చించారు. వారంతా తిరిగివస్తున్న దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. యూనిట్‌కు కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని చెప్పారు. వైద్యుడు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్త, మందులను మొబైల్ యూనిట్‌లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అంగన్వాడీలు, పంచాయతీ రాజ్ విభాగాలు గ్రామాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మొబైల్ వాహనాలుగా ఆర్టీసీ బస్సులు ...