గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పూర్తిస్థాయి కార్పొరేషన్ మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. మంగళగిరి మండలంలో 11 గ్రామాలు, తాడేపల్లి మండలంలో 10 గ్రామాలు, రెండు పురపాలక సంఘాలను కలిపి 50 డివిజన్లుగా విభజించారు. ఒక్కో డివిజన్లో 5వేల మంది ఓటర్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
మంగళగిరి, తాడేపల్లి వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు సిద్ధం - Mangalagiri and Thadepalli corporation
మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన నగరపాలిక కమిషనర్ 2011 లెక్కల ప్రకారం 50 వార్డులుగా పునర్విభజన చేశారు. వారంలోగా అభ్యంతరాలు, సలహాలు తెలపాలని కమిషనర్ కోరారు.
![మంగళగిరి, తాడేపల్లి వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు సిద్ధం Preparation of redistribution proposals for Mangalagiri and Thadepalli divisions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11418583-978-11418583-1618505288490.jpg)
మంగళగిరి, తాడేపల్లి వార్డుల పునర్విభజన
కార్పొరేషన్లో మొత్తం 2లక్షల 53వేల 831 మంది ఓటర్లు, 194.41 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నట్లు మ్యాప్‌లో పేర్కొన్నారు. ఈ పటాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లో కార్పొరేషన్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇవీచదవండి.