ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చుట్టుముట్టిన వరద.. గర్భిణీ ప్రసవ వేదన - flood effect on pregannt women at guntu

గుంటూరు జిల్లాలో వరద వల్ల ఓ గర్భిణీని ఆసుపత్రికి వెళ్లేందుకు మార్గంలేక గ్రామంలోనే పురుడు పోశారు. కొల్లూరు మండలం ఈపూరులంకకు చెందిన గర్భిణీకి..ఈ ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు ఎక్కువ కావడంతో గ్రామంలోనే కాన్పు చేశారు. కాన్పు అనంతరం పోలీసులు తాళ్ల సాయంతో తల్లిని, బిడ్డను వరద దాటించారు. 108 వాహనం ద్వారం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

pregnant lady difficulty due to flood at guntur
కష్టమైన కాన్పు

By

Published : Oct 15, 2020, 12:14 PM IST

గుంటూరు జిల్లాలో వరద కారణంగా ఓ గర్భిణీ ఆసుపత్రికి వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. కొల్లూరు మండలం ఈపూరు లంకకు చెందిన గర్బిణీకి ఇవాళ ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఆసుపత్రి వెళ్లేందుకు ఏ దారి లేదు. గ్రామంలోకి వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. 108 వాహనం గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. పోలీసులు తాళ్ళ సాయంతో ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అది ప్రమాదమని గ్రహించి అందుకు సాహసించ లేదు.

నొప్పులు ఎక్కువ కావటంతో స్థానికుల సహకారంతో గ్రామంలోనే కాన్పు చేశారు. కాన్పు అనంతరం తాళ్ల సాయంతో తల్లిని, బిడ్డను పోలీసులు ప్రవాహందాటించారు. అప్పటికే 108 సిద్ధంగా ఉంచారు. తల్లి, బిడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కొల్లూరు ఎస్సై ఉజ్వల్ కుమార్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకున్నారు. దీంతో గ్రామస్థులు పోలీసులను ప్రశంసించారు. అలాగే కాన్పుకు సహకరించిన మహిళకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కష్టమైన కాన్పు

ఇదీ చదవండి: విలయం... వాయుగుండంతో రాష్ట్రంలో విధ్వంసం

ABOUT THE AUTHOR

...view details