ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిడ్డకు జన్మనిస్తూ మహిళ మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - చిలకలూరిపేటలో మహిళ మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాన్పుకు వచ్చిన జాస్మిన్ అనే మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించిందంటూ.. ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

pregnant dead in chiakaluripeta while delivering baby
చిలకలూరిపేటలో బిడ్డకు జన్మనిస్తూ గర్భిణీ మృతి

By

Published : Jan 28, 2021, 6:21 PM IST

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కాన్పుకు వచ్చిన మహిళ మరణించిందని.. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బుధవారం జరిగిందీ ఘటన. గుర్రాల చావడికి చెందిన జాస్మిన్​ను.. రెండో కాన్పు కోసం కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమంలో జాస్మిన్ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మరణించిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details