ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సన్నబియ్యం హామీ దృష్టి మళ్లించేందుకే రేషన్​ వాహనాలు ప్రారంభం'

రేషన్​ సరుకుల ధర పెంచి ఇప్పుడు ఇంటింటికీ పంపిణీ అంటూ వాహనాలు ప్రారంభించడం మోసమేనని వైకాపా ప్రభుత్వంపై మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. వైకాపా నేతల దోపిడీ కోసమే రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారని.. కార్పొరేషన్ ద్వారా గతంలో కొనుగోలు చేసిన వాహనాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. బియ్యం పంపిణీ, వాహనాల పంపిణీలోనూ సొంత వారికే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు.

prathipati pillarao press note on ration vehicles
ప్రత్తిపాటి పుల్లారావు

By

Published : Jan 21, 2021, 9:15 PM IST

రేషన్ సరుకుల ధరలు పెంచి ఇంటింటికీ పంపిణీ అంటూ వాహనాలు ప్రారంభించడం మోసమేనని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. సన్నబియ్యం హామీ నుంచి దృష్టి మళ్లించేందుకే వాహనాలు ప్రారంభించారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్​ రెడ్డి కుతంత్రంతో రేషన్ డీలర్ల వ్యవస్థ కనుమరుగవుతోందని దుయ్యబట్టారు. వైకాపా నేతల దోపిడీ కోసమే రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. కార్పొరేషన్ ద్వారా గతంలో కొనుగోలు చేసిన వాహనాలు ఏమయ్యాయని నిలదీసిన ప్రత్తిపాటి.. బియ్యం పంపిణీ, వాహనాల పంపిణీలోనూ సొంత వారికే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో పది రకాల సరుకులు రేషన్ దుకాణాల ద్వారా అందిస్తే.. నేడు కేవలం బియ్యం, పంచదార, కందిపప్పుకే వాటిని పరిమితం చేశారని విమర్శించారు. కందిపప్పుపై 27 రూపాయలు పెంచారని.. దీంతో ఏటా 492 కోట్లు, పంచదారపై 255 కోట్లు ప్రభుత్వం దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరల పెంపుతో ఒక్కో కుటుంబంపై 6వేల రూపాయలు పైగా అదనపు భారం పడుతోందన్నారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రేపు 'రేషన్ పంపిణీ' ప్రత్యేక వాహనాల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details