భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల గుంటూరు జిల్లాలోని ఆకుల గణపవరంలో నేటి నుంచి 5 రోజుల పాటు జరగనుంది. మొదటి రోజున అష్టోత్తర శతనామార్చ పూజలు, సామూహిక లక్ష తమలపాకుల పూజ, సువర్చలా ఆంజనేయ కళ్యాణం, స్వామివారి కోవెల విడిది కార్యక్రమాలకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు . ఆలయ పూజారులు పరాశరం రంగాచార్యులు యువకిశోరాచార్యులు మూలవిరాట్ను బెంగుళూరు నుంచి తీసుకువచ్చిన పుష్పాలతో అలంకరించారు. ఈ ఉత్సవాల్లో ఆరు విభాగాల్లో జాతీయస్థాయి ఎడ్ల పందేలు జరగనున్నాయి.
నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల - guntur prasannanjaya latest news
గుంటూరు జిల్లాలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల నేటి నుంచి ఐదు రోజులు పాటు జరుగనుంది. దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఉత్సవాల్లో జాతీయస్థాయి ఎడ్ల పందేలు ఆరు విభాగాల్లో జరగనున్నాయి.
ప్రసన్నాంజనేయ తిరునాళ్ల వార్తలు, గణపవరం ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల వార్తలు
ఇదీ చదవండి:గుంటూరులో మే 16 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ