ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం.. ప్రకాశం వాసి మృతి - one killed in road accident occured at narsaraopeta in guntur

గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ప్రకాశం జిల్లా తంగెడమల్లి గ్రామానికి చెందిన శృంగవరపు విక్రమ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మల్లమ్మ సెంటర్​లోని ఫ్లై ఓవర్​ పై ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న విక్రమ్​ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టగా ప్రమాదం జరిగింది.

prakasam district resident was killed in road accident occured at narsaraopeta in guntur
నరసారావుపేటలో రోడ్డు ప్రమాదం.. ప్రకాశం వాసి మృతి

By

Published : Dec 26, 2020, 9:25 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా తంగెడమల్లి గ్రామానికి చెందిన శృంగవరపు విక్రమ్ అనే వ్యక్తి మృతి చెందాడు. వినుకొండ రోడ్డు నుంచి నరసరావుపేట మల్లమ్మ సెంటర్​లోని ఫ్లై ఓవర్​ పై ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది.

తీవ్రగాయాలపాలైన విక్రమ్ రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట ఒకటో పట్టణ ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details