ప్రమాదవశాత్తు పడిపోయిన ప్రభ... ఇద్దరు కూలీలకు గాయాలు - kotappakonda news
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం నుంచి కోటప్పకొండకు తరలిస్తున్న ప్రభ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
కోటప్పకొండకు ప్రజలు తరలి వెళ్లే సమయంలో అపశృతి నెలకొంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి చెందిన ప్రభ... గురువారం మధ్యాహ్నం గ్రామం నుంచి భక్తజన సందోహం మధ్య కోటప్పకొండకు బయలుదేరింది. ప్రభ అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం- కట్టుబడి వారి పాలెం మధ్య ప్రమాదవశాత్తు పడిపోయింది. ట్రాక్టర్కు సైడు ఇవ్వబోయి ప్రభ చక్రం గుంతలో పడింది. ఒక్కసారిగా ప్రభ ఒరిగిపోయి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తాడును పట్టుకుని ఉన్న ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.