వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ - AMG India International charity ppe kits distribution news
చిలకలూరిపేట 'ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ' ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. ఏఎంజీ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ కంటి మహంతి ఆదేశాల మేరకు రూ.6 లక్షల విలువైన 350 కిట్లను పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన 'ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ' ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు ఐసోలేషన్ కేంద్రాలకు చెందిన వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. ఏఎంజీ డైరెక్టర్ డాక్టర్.అరుణ్‌కుమార్ కంటి మహంతి ఆదేశాల మేరకు రూ.6 లక్షల విలువైన 350 కిట్లను సిబ్బంది పంపిణీ చేశారు. కాటూరి మెడికల్ కళాశాలలో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి 50, గుంటూరు గోరంట్ల పరిధిలోని ఐసోలేషన్ కేంద్రానికి 150, జీజీహెచ్‌కు 150 కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంజీ సంస్థ సీఏవో బి.మాశిలామణి, సీపీవో కృపారావు తదితరులు పాల్గొన్నారు.