గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాతాశిశు విభాగంలో మధ్యాహ్నం 2 నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరమ్మతుల కోసం అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ప్రభుత్వాస్పత్రిలో మూడు జనరేటర్లు ఉన్న అవి నిరుపయోగంగా మారాయి. విద్యుత్ లేక బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెల్ఫోన్ల వెలుతురులో చిన్నారులకు విసనకర్రలతో గాలి విసిరారు. దాదాపు ఏడు గంటల తర్వాత అధికారులు విద్యుత్‌ను పునరుద్ధరించారు.
ప్రభుత్వాస్పత్రిలో కరెంటు కోత.. అల్లాడిన శిశువులు - తెనాలి ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్ సరఫరా
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేక బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఏడు గంటల తర్వాత అధికారులు విద్యుత్‌ను పునరుద్ధరించారు.
తెనాలి ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్ సరఫరా