ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2019, 7:04 AM IST

ETV Bharat / state

రాష్ట్రంలో మూడో డిస్కం.... విద్యుత్ అధికారుల ప్రతిపాదన

రాష్ట్రంలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటుచేసే ఆలోచనలో విద్యుత్​శాఖ ఉంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపి సీపీడీఎల్ ఏర్పాటుచేయాలని విద్యుత్ అధికారులు యోచిస్తున్నారు.

రాష్ట్రంలో మూడో డిస్కం

రాష్ట్రంలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో విద్యుత్​శాఖ ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మూడో డిస్కం రాష్ట్రంలో ఏర్పాటవుతుంది. రాష్ట్ర విభజనకు ముందు సెంట్రల్ డిస్కం పరిధిలో అనంతపురం, కర్నూలు జిల్లాలుండేవి. విభజన తర్వాత ఈ రెండు జిల్లాలను దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో కలిపారు. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు సేవలందించాల్సివస్తోంది. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో 4 జిల్లాలే ఉన్నాయి. రాజధాని క్రమేణా అభివృద్ధి చెందుతున్నందున పాలన సౌలభ్యానికి సెంట్రల్ డిస్కంను ఏర్పాటుచేయాలని విద్యుత్ శాఖ ప్రతిపాదిస్తోంది. రాజధాని అవసరాల రీత్యా సీఆర్​డీఏ పరిధి వరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని తొలుత అధికారులు భావించారు. ఈ పరిధి మాత్రమే కాకుండా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపి సీపీడీఎల్ ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో ఉన్నారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను వేరుచేసి సీపీడీఎల్ ఏర్పాటుచేయాలనే మరో ప్రతిపాదన కూడాఉంది. సీపీడీఎల్ కార్యాలయాన్ని గుంటూరు,విజయవాడల్లో ఏదో ఒకచోట ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. రెండు ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వం ఒకదాన్ని ఆమోదించవచ్చని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details