Power Problems for Industries in AP:విద్యుత్ కొరత అధిగమించడానికి ప్రభుత్వం పరిశ్రమలకు కరెంటు కోతలు విధిస్తోంది. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని భరించలేక విలవిల్లాడుతున్న పరిశ్రమల్ని.. అనధికారిక కరెంటు కోతలు మరింత కుంగదీస్తున్నాయి. బయటకు విద్యుత్ కోతలనిచెప్పకుండా.. ఎక్కడికక్కడ బ్రేక్‌డౌన్‌లు, నిర్వహణ పనుల పేరుతో కరెంటు తీసేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంటు కోతలు విధించడం వల్ల పరిశ్రమలు, మరీ ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు.. అనేక అవస్థలు పడుతున్నాయి.
Power Cuts In AP జగనన్న.. ఈ అంధకారం ఏంటన్న! ఎడాపెడా విద్యుత్ కోతలతో.. అల్లాడుతున్న ప్రజానికం
Electricity Cut for Two Hours a Day:రాష్ట్రంలో పలు చోట్ల సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేసి, కేవలం బల్బులు వెలిగించుకునేందుకే విద్యుత్ వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక ఏఈలు తమ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. ఫలానా టైమ్‌లో కేవలం లైటింగ్ కోసమే విద్యుత్ వాడుకోవాలని కొన్నిసార్లు, వినియోగాన్ని బాగా తగ్గించుకుని.. 40 శాతమే వాడుకోవాలని.. ఏ రోజుకారోజు వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నారు.
విద్యుత్ కోతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటున్నాయి. రోజుకి గంటన్నర నుంచి రెండు గంటల పాటు కరెంటు కట్ చేస్తున్నారని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. నిర్దిష్ట సమయం అంటూ లేకుండా, ముందుగా చెప్పకుండా కరెంటు తీసేయడంతో.. పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువగా కరెంటుపైనే ఆధారపడే ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు వంటి వాటికి మరింతగా సమస్యలు ఎదురవుతున్నాయి.
Sub Station on Rushikonda: రుషికొండ నెత్తిన మరో బండ.. విద్యుత్తు సబ్‌స్టేషన్ ఏర్పాటుకు యత్నం
Power Cut to Industries in Visakhapatnam:విశాఖపట్నంలోని పారిశ్రామికవాడలో పరిశ్రమలకు రోజుకి గంటన్నరపాటు కరెంటు కోత విధిస్తున్నారు. ఏ సమయంలో తీసేస్తారో ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల పని అర్ధంతరంగా ఆపేయాల్సి వస్తోందని ఒక చిన్న తరహా పరిశ్రమ యజమానులు వాపోతున్నారు.
Power Cut to Industries in Srikakulam district:శ్రీకాకుళం జిల్లా జిల్లా రణస్థలం మండలంలోని పైడి భీమవరంలోని రసాయన పరిశ్రమలకు గత రెండు వారాల నుంచి రోజుకు రెండు మూడు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు.
Power Cut to Industries in joint Guntur district:ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్పిన్నింగ్ మిల్లులకు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బల్బులు వెలిగించుకోవడానికి మాత్రమే కరెంటును వినియోగించాలంటూ ఈ నెల 10వ తేదీ నుంచి రోజూ వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఉత్పత్తి ఆపేసినా.. సిబ్బందికి జీతాలు చెల్లించడం వంటి ఖర్చులు తప్పవు. దాని వల్ల ఉత్పాదక వ్యయం పెరిగిపోయి, ఇప్పటికే నష్టాల బాటలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నాయి.
Electricity Subsidy: ఏపీలో విద్యుత్ రాయితీపై కోతలు.. 2.35 లక్షల కుటుంబాలకు షాక్..
Power Cut to Industries in Krishna district:కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం పరిధిలో పామర్రు రోడ్డు నుంచి ఆటోనగర్ వరకూ వెల్డింగ్, కార్పెంటర్ మిషన్ల పని, ట్రాక్టర్లు, లారీల ట్రక్కుల తయారీ, వ్యవసాయ పరికరాల తయారీ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వారం పది రోజులుగా ఈ ప్రాంతంలో రోజుకి అయిదారు గంటలపాటువిద్యుత్తు కోతలు పెడుతున్నారు. ఈ కోతలతో కూలీలకు పూర్తిగా పనిలేకుండాపోతోంది. చిన్న పరిశ్రమల యజమానులు పని లేకపోయినా.. సిబ్బందిని ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సి వస్తోందని గగ్గోలు పెడుతున్నారు.
Vizianagaram and Anakapalli Districts:విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోని ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు కరెంటు కోతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆ పరిశ్రమల్ని జనరేటర్లపై నడపడం సాధ్యం కాదు. ఉత్పత్తి తగ్గించుకోవడం మినహా ప్రత్యామ్నాయం లేక నష్టపోవాల్సి వస్తోందని ఆ పరిశ్రమల యాజమాన్యాలు వాపోతున్నాయి.
People Suffer With Power Cut in Villages: అంధకారంలో వేల గ్రామాలు.. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ఆందోళన
1000 Mgawatts Shortage of Electricity in State:రాష్ట్రంలో ప్రస్తుతం రోజూ వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరత ఉంది. దీన్ని అధిగమించడానికి పరిశ్రమలకు సరఫరా తగ్గిస్తున్నారు. పరిశ్రమల్లో వినియోగం తగ్గించినా.. పీక్ అవర్స్‌లో డిమాండ్ సర్దుబాటు సాధ్యం కానప్పుడు గ్రామాలు, కొన్ని పట్టణాల్లో రోజూ నాలుగైదు గంటలపాటు విద్యుత్ కోతలను విధిస్తున్నారు.
Power Cuts in AP Industrial sector అటు కరెంటు కోత.. ఇటు కంపెనీల మూత!