మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆరుచోట్ల ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక కళాశాల ఉంది. ఐదో తరగతిలో చేరితే ఇంటర్ వరకు విద్యకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొవిడ్‌తో ఈ ఏడాది పూర్తిస్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. ఆన్‌లైన్‌లో ప్రవేశాలకు అవకాశం కల్పించినా ఎక్కువమంది దరఖాస్తు చేసుకోలేదు.
ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించి ప్రవేశం కల్పించే అవకాశాన్ని ప్రిన్సిపాళ్లకు కల్పించారు. ఐదోతరగతిలో ప్రవేశానికి సమీప గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించవచ్ఛు సత్తెనపల్లి సమీపంలోని మాదల, వినుకొండ, నరసరావుపేట, దాచేపల్లి, నిజాంపట్నం, నక్షత్రానగర్‌లో గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయబోతున్నట్లు మాదల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.