గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా కేంద్ర పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన పోషన్ అభియాన్ కార్యకర్తలను పోలీసలు బలవంతంగా వెనక్కి పంపించారు. గతేడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోషన్ అభియాన్లో పని చేసేందుకు.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 340 మంది సేవకులను ఒప్పంద పద్ధతిలో తీసుకున్నారు.
పోషన్ అభియాన్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
ప్రజాప్రతినిధులను కలిసేందుకు తాడేపల్లి వైకాపా కేంద్ర పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన పోషన్ అభియాన్ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వెనక్కి పంపించారు. ఒప్పందం ప్రకారం ఏడాది పనిచేయాల్ని ఉన్నా.. తమను అర్థాంతరంగా తీసేశారని.. దీనిపై మాట్లాడేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
పోషన్ అభియాన్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
ముందస్తు ఒప్పందంలో భాగంగా ఏడాది పని చేయాలని నిబంధన విధించారు. అయితే తమను మార్చి నుంచి అర్థాంతరంగా తీసేశారంటూ వారు వాపోయారు. పలు దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో ఉండే ప్రజాప్రతినిధులను కలిసేందుకు 13 జిల్లాల నుంచి వచ్చిన తమను పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...విజయవాడ రింగ్ రోడ్ సమీపంలో ప్రమాదం