ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోషన్ అభియాన్ పథకం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన - పోషన్ అభియాన్ పథకం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వార్తలు

గుంటూరు జిల్లాలో పోషన్ అభియాన్ పథకం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమను తొలగించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

poshan abhiyan   outsourcing employees protest at guntur
గుంటూరులో పోషన్ అభియాన్ పథకం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

By

Published : Jul 6, 2020, 12:46 PM IST

గుంటూరు జిల్లా రాష్ట్ర స్త్రీ - శిశు సంక్షేమ కార్యాలయం ఎదుట పోషన్ అభియాన్ పథకం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమను విధుల నుంచి తొలగించారంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. గత సంవత్సరం నవంబర్​లో తమను ఏడాది కాంట్రాక్టు కింద ఉద్యోగాలు ఇచ్చి.. 6 నెలల వ్యవధిలోనే విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోషన్ అభియాన్​లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న 340 మంది ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు. తక్షణమే తమను ఉద్యోగాలలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details