పోసానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి.. ఏంటంటే..! - ysrcp news
Posani: పోసానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవికి ఇచ్చింది. రాష్ట్ర ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఉత్తర్వలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
Posani Krishna Murali: సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇతర నియమ, నిబంధనలు, అపాయింట్‌మెంట్ వివరాలు ప్రత్యేకంగా వెల్లడించనున్నట్లు ప్రకటించింది. రచయితగా చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను మొదలు పెట్టిన పోసాని, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రచయితగా కంటే కూడా నటుడిగా ఎక్కువ సినిమాల్లో మెప్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ వచ్చారు. గత ఎన్నికల్లోనూ వైకాపా తరపున ప్రచారం చేశారు.