Popular YouTuber Chandrasekhar Arrest in Rape Case : ఈ ఇంటర్ నెట్ యుగంలో సోషల్ మీడియా హవా అంతా ఇంతా కాదు. ఆ సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఎక్కువమంది వీక్షించే యూట్యూబ్(Youtube)లో ప్రాముఖ్యం సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రస్తుత కాలం యువత కూడా వారినే ఫాలో అవుతూ, వారు ఏ వీడియోలు చేసిన కచ్చితంగా చూసి తీరుతున్నారు. వారి వీడియోలను చూస్తూ వారి ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఫిదా అయి కొంత మంది అమ్మాయిలు యూట్యూబర్స్ వలలో పడుతున్నారు.
వారితో ప్రేమాయణం సాగించి, చివరకు పెళ్లి అనే విషయం వచ్చేసరికి యూట్యూబ్ స్టార్స్ చెక్కేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ ప్రముఖ యూట్యూబర్ చంద్రశేఖర్(చందుగాడు), యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. చివరికి ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో యూట్యూబర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యువకుడిని బలి తీసుకున్న ప్రేమ - రహస్య భాగాలపై కారం కొట్టి దారుణ హత్య
YouTuber Chandu Gadu :యూట్యూబ్ చందుగాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్(Chandu Gadu) ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని నార్సింగి పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2021 ఏప్రిల్ 25న పుట్టిన రోజు వేడుకలకు యువతిని ఆహ్వానించి అత్యాచారానికి చంద్రశేఖర్ పాల్పడినట్లు తెలిపారు. నిందితుడిపై 420, 376(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. యూట్యూబర్ చంద్రశేఖర్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
పుష్ప సినిమాలో కేశవపై కేసు నమోదు : పుష్ప సినిమా(Pushpa Movie)లో సహనటుడిగా నటించిన కేశవ అలియాస్ జగదీశ్ ఆలీపై ఈనెల 6వ తేదీన కేసు నమోదు అయింది. ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడంలో కేశవ(మచ్చా) పాత్ర ఉందని పోలీసులు అతనని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత నెల 27వ తేదీన ఓ మహిళ వేరే వ్యక్తితో ఉండడాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసి ఆమెను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేశవ వేధింపులు భరించలేక జూనియర్ ఆర్టిస్టు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Women Safety Tips Telugu : అమ్మాయిలపై 'ప్రేమ' దాడులు.. అమ్మానాన్న ఎలా కాపాడుకోవాలంటే..?