ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పూనం మాలకొండయ్య - తెనాలిలో పర్యటించిన పూనం మాలకొండయ్య

నివర్ తుపాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలు ఈ నెల పదో తేదీన ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో ఉంచుతామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న పూనం మాలకొండయ్య
దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న పూనం మాలకొండయ్య

By

Published : Dec 9, 2020, 1:07 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలంలో నివర్ తుపాన్​తో దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పరిశీలించారు. పంట నష్టం వివరాల నమోదు చివరి దశలో ఉందని, రైతుల పేర్లు జాబితాలో లేకపోతే రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు అందజేయాలని అధికారులకు సూచించారు.

ఈ నెల 15 వ తేదిన జాబితా ప్రకటిస్తామని చెప్పారు. నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేస్తామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీతో మినుము, పెసర విత్తనాలు అందజేస్తామన్నారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఆమె వెంట సంయుక్త కలెక్టర్ దినేశ్ కుమార్ ఉన్నారు.

ఇదీ చదవండి

సమన్వయ లోపం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details