సొంత ప్రయోజనాల కోసం తెదేపా.. సహకార డెయిరీలను నిర్వీర్యం చేసిందని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆరోపించారు. సంగం డెయిరీ లాభాలను సొసైటీలకు ఇవ్వకుండా డీవీసీ ట్రస్టుకు మళ్లించారని ఆయన విమర్శించారు. రైతులకు చెందాల్సిన లాభాలను దారి మళ్లించారని.. సహకార డెయిరీని మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల ప్రైవేటు కంపెనీగా మార్చుకున్నారని ఆరోపించారు. సంగం డెయిరీ వార్షిక టర్నోవర్ 900 కోట్లయితే.. కేవలం 0.6 శాతం మాత్రమే లాభాలుగా చూపుతున్నారని... మిగతా సొమ్ము ఎక్కడికి వెళ్లిందంటూ రోశయ్య ప్రశ్నించారు.
'సొంత ప్రయోజనాల కోసం సహకార డెయిరీలను తెదేపా నిర్వీర్యం చేసింది' - తెదేపాపై పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య విమర్శలు
సొంత ప్రయోజనాల కోసం .. రాష్ట్ర వ్యాప్తంగా సహకార డెయిరీలను తెదేపా నిర్వీర్యం చేసిందని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య విమర్శించారు. సంగ డెయిరీ లాభాలను సొసైటీలకు ఇవ్వకుండా డీవీసీ ట్రస్టుకు మళ్లించారని ఆరోపించారు.
ponnuru mla
లాభాల్ని రైతులు, సహకార సొసైటీలకు పంచకుండా డీవీసీ ట్రస్టుకు పరోక్షంగా మళ్లించారని రోశయ్య ఆరోపించారు. నిర్వీర్యమైన సహకార డెయిరీలకు జవసత్వం కల్పించేందుకు ప్రభుత్వం అమూల్ కు బాధ్యతలు అప్పగించిందన్న రోశయ్య...అమూల్ సహకార సంస్థని... వచ్చే లభాలు రైతులకే పంచుతుందని రోశయ్య స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:కరోనా విజృంభణ... స్వచ్ఛంద సంస్థల ఉదారత