పొన్నూరులోని మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు. గ్రామ వాలంటీర్గా ఎంపికైన నిరుద్యోగులు సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టుపక్కల ఎక్కడా పిచ్చి మొక్క అనేది కనపడకుండా చేయాలని అధికారులకు సూచించారు. బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో మొక్కలు నాటిన ఆయన... మున్సిపల్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
"ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలి" - guntur district
ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సూచించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ponnuru mla paticpated in icdc under program at guntur district