ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక చోట పరస్పర దాడి.. మరో చోట పోలీసుల బెదిరింపులు..

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో.. స్వల్ప వివాదం జరిగింది. ఏజెట్ల మధ్య వివాదం నెలకొనడంతో కుర్చీలతో దాడి చేసుకున్నారు. పోలీసులు తనను స్టేషన్​కు రమ్మని ఫోన్​ చేస్తున్నారంటూ మరో చోట పోలింగ్ ఏజెంట్ ఆరోపించారు.

polling at guntur
సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్

By

Published : Feb 21, 2021, 12:52 PM IST

ధూళిపాళ్లలో... కూర్చీలతో దాడులు చేసుకున్న ఏజెంట్లు

కుర్చీలతో దాడి చేసుకున్న పోలింగ్ ఏజెంట్లు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల ఎస్సీ కాలనీలో.. ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత పెరగటంతో.. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఏజెంట్లకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన ఓ వర్గంలోని ఒక ఏజెంట్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. గాయపడిన ఇద్దరు ఏజెంట్లను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కంటెపూడిలో సీపీఐ ఏజెంట్​కు పోలీసుల బెదిరింపులు

పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణ

తనను పోలీసు స్టేషన్​కు రావాలని సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఫోన్​ చేస్తున్నారని.. సత్తెనపల్లి నియోజకవర్గం కంటెపూడికి చెందిన సీపీఐ ఏజెంట్ కృష్ణారెడ్డి ఆరోపించారు. గత మూడు రోజులుగా పోలీసులు పోలీస్ స్టేషన్​కు రావాలని ఫోన్ చేస్తున్నానరి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నికల అధికారులు తమకు న్యాయం చేాయాలని ఏజెంట్ కృష్ణారెడ్డి వేడుకున్నారు.

ఇదీ చదవండి:పల్లె పోరు: ఉదయం 10.30 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details