CELEBRITIES RAMADAN WISHES: శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని పలువురు నేతలు ముస్లిం సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు తమ ట్విట్టర్ వేదికగా రంజాన్ పండుగ విశిష్టతలను పంచుకున్నారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్:రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ముస్లిం.. దేవుడికి దగ్గరయ్యే మాసమే రంజాన్ అని ఆయన పేర్కొంటూ ట్వీట్ చేశారు.
"రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ప్రతీ ముస్లిం.. దేవుడికి దగ్గరయ్యే నెలే రంజాన్." - గవర్నర్ అబ్దుల్ నజీర్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి: రాష్ట్రంలోని ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. మనిషిలోని అధర్మాన్ని, చెడు భావనల్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ అని ఆయన తన ట్వీట్లో జోడించారు.
"సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని ద్వేషాన్ని, అధర్మాన్ని, చెడు భావనల్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్." - సీఎం జగన్మోహన్ రెడ్డి