ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Round Table Meet: 'సీఎం జగన్ ఉద్యమానికి ముందుకు వస్తే.. కలిసి నడుస్తాం'

ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుకు కేంద్రంపై ఉమ్మడి పోరాటం అవసరమని గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీర్మానించాయి. సీఎం జగన్‌ ఉద్యమిస్తే తామంతా కలిసి వస్తామని నేతలు తెలిపారు. ఉద్యోగాలు, పరిశ్రమల కోసం హోదా తప్పదని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఆన్‌లైన్ బహిరంగ సభ, రౌండ్ టేబుల్ భేటీలతో పాటు.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఎంపీలను కలుస్తామని వెల్లడించారు.

political parties round table meeting over special status
సీఎం జగన్ ఉద్యమిస్తే..కలిసి వస్తాం

By

Published : Jul 4, 2021, 5:11 PM IST

సీఎం జగన్ ఉద్యమిస్తే..కలిసి వస్తాం

ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేయాలని గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు తీర్మానించాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉద్యమిస్తే తామంతా కలిసి వస్తామని సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ తెలిపారు. గత ఏడేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతున్నా.. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విదేశీ పెట్టుబడులు తెలంగాణకు 8 వేల కోట్లు వస్తే.. ఏపీకి కేవలం 638 కోట్లు వచ్చాయన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ప్రత్యేక హోదా తప్పదని ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారన్న విశ్వాసంతో ప్రజలు ఓట్లేశారని.. తమ పోరాటానికి కలిసి రావాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల అంశంపై అందరం కలిసి వెళ్లి ప్రధానిని కలుద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుని పట్టించుకోని కేంద్రం.. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయటానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గంగవరం పోర్టుని ప్రైవేటీకరణ చేయటంలో ప్రధాని, ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో ఆన్​లైన్ బహిరంగ సభ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించటంతో పాటు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఎంపీలను కలుస్తామని తెలిపారు. ఉద్యోగాల కల్పన విషయంలో జగన్ అవాస్తవాలు చెప్పటం మానుకోవాలని హితవు పలికారు.

ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో కుమ్మక్కై.. ప్రత్యేక హోదా అంశాన్ని గాలికొదిలేశారని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న జగన్.. ఇప్పుడు మోదీ కాళ్లవద్ద సాగిలపడ్డారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే నిధుల ఇవ్వాల్సి ఉన్నా...రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోలేకపోతుందని పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

విభజన హామీలు అమలు చేయకుండా భాజపా మోసం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఈ అంశంలో వైకాపా ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గి వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి నష్టం చేసిన భాజపాను విమర్శించకపోతే హోదా రాదన్నారు. కరోనా సెకండ్ వేవ్​తో జనం పిట్టల్లా రాలిపోతున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం: సజ్జల

ABOUT THE AUTHOR

...view details