జనతా కర్ఫ్యూకు మద్దతుగా నేతలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం ప్రజాక్షేత్రంలో తీరిక లేకుండా గడిపే వీరు... ఇవాళ పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన నివాసంలోనే కుటుంబసభ్యులతో గడిపారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఇంట్లోనే సినిమాలు చూస్తూ గడిపారు. ఇంటి నుంచే మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ వారికి సూచనలు ఇచ్చారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కుటుంబసభ్యులతో కలిసి కరోనా వ్యాప్తిపై వార్తలు చూశారు. హోంమంత్రి సుచరిత గుంటూరులోని తన నివాసంలో కుటుంబసభ్యులతో గడిపారు. మోపిదేవి వెంకటరమణ కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. మాజీమంత్రి సోమిరెడ్డి తన కుమారుడు, మనవడు, మనవరాలితో కలిసి హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నారు. సాయంత్రం వేళ చప్పట్లు కొట్టి వైద్యులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సంఘీభావం తెలిపారు.
ప్రజాప్రతినిధులు ఇలా గడిపారు..! - ఏపీలో జనతా కర్ఫ్యూ వార్తలు
జనతా కర్ఫ్యూలో భాగంగా నేతలు ఇళ్లలోనే ఉండిపోయారు. నిత్యం బిజీగా ఉండే వీరు ఇవాళ కుటుంబసభ్యులతో కాలం గడిపారు. కొందరు సినిమాలు చూస్తూ... మరికొందరూ వార్తలు వింటూ గడిపారు.
Political leaders have spent time with family members on janatha day