75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుంటూరులో జరిగిన దారుణ హత్యపై.. రాష్ట్రంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి జగన్... దిశ కింద కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. రమ్య మృతదేహమున్న జీజీహెచ్‌ను సందర్శించిన హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కుటుంబీకులను ఓదార్చారు. మృతురాలి ఫోన్ లాక్ ఓపెన్ అయితే మరింత సమాచారం లభించొచ్చని సుచరిత తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: చంద్రబాబు
రమ్య హత్యపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల దీనస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. గత రెండేళ్లలో అఘాయిత్యాలు పెరిగిపోయాయని.. ప్రభుత్వ చేతకానితనమా లేక నిందులకు రక్షణ కల్పించడమా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. రమ్య తండ్రి, అక్కతో మాట్లాడిన తెలుగుదేశం ప‌్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారిని నేడు నేరుగా కలవనున్నట్టు తెలిపారు.
ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలి: రాజకీయ పార్టీలు