Political_Leaders_Comments_On_Chandrababu_Arrest: చంద్రబాబు అరెస్ట్..ఖండించిన పలువురు నాయకులు Political Leaders Comments On Chandrababu Arrest : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టును టీడీపీ నేతలు, అలాగే ఇతర పార్టీల నేతలు ఖండించారు.
Pawan kalyan Comments On Chandrababu Arrest: నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు :చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఖండించారు. ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణమని, ఇలాంటి చర్యలను వైసీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సింది పోలీసులు కదా ప్రశ్నించారు.
Balakrishna React On Chandrababu Arrest : ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం :చంద్రబాబు అరెస్టు దుర్మార్గమని నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని జగన్ గాలికొదిలేశారని, ప్రతిపక్షనేతలపై కక్షసాధింపులకే జగన్ పరిమితమయ్యారని తెలిపారు. చంద్రబాబును ఎలాగైనా జైల్లో ఉంచాలనేదే జగన్ కుట్ర అని, ఆధారాలు లేకుండా ఏ చట్టప్రకారం చంద్రబాబును అరెస్టు చేశారని ప్రశ్నించారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని నిలదీశారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, న్యాయపోరాటం చేసి ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని తెలిపారు.
లక్షల కోట్లు కొట్టేసిన వ్యక్తి లండన్‌లో విహారయాత్ర : చంద్రబాబు అరెస్టును బొండా ఉమ తీవ్రంగా ఖండించారు. జగన్‌కి ఓటమి భయం పట్టుకుందని... అందుకే ఏదోక కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షల కోట్లు కొట్టేసిన వ్యక్తి లండన్‌లో విహారయాత్ర చేస్తుంటే.. ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యమని దుయ్యబట్టారు.
Chandrababu Arrest Tension in AP: రాష్ట్రం వ్యాప్తంగా హై అలర్ట్.. టీడీపీ నేతల హౌస్ అరెస్టులు..
తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు :టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ముమ్మాటికి అప్రజాస్వామికమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
ఎందుకు ఛార్టిషీట్ వేయలేదు :చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయపరమైన కక్ష తప్ప మరొకటి కాదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. 2021లో కేసు రిజిస్టర్ చేస్తే ఇప్పటివరకు ఎందుకు ఛార్టిషీట్ వేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి అవినీతి లేనందునే ఛార్జిషీట్ నమోదు చేయలేదుని తెలిపారు. ఈ కేసులో అక్రమాలు, అవినీతి జరిగిందేమీ లేదని, స్కిల్ డెవలప్‌మెంట్ కింద దాదాపు 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు.
జగన్ పైశాచిక ఆనందం :ఒక పథకం ప్రకారం చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేశారని, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలిపారు.
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది : చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలనేది జగన్ కుట్ర అని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉంటే అందరూ ఉండాలా అని ప్రశ్నించారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prattipati PullaraoReact On Chandrababu Arrest : ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు :చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్ అన్ని హద్దులు దాటేశారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని, నిరంకుశత్వం మితిమీరినప్పుడు తిరుగుబాటు అనివార్యం అవుతుంది. జగన్ నిరంకుశ చర్యకు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కొల్లు రవీంద్ర ధ్వజం :టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జగన్ ఉన్మాదానికి ఇదొక పరాకాష్ట అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రజలందరూ అక్రమ అరెస్టును ఖండిస్తూ తీవ్ర నిరసన తెలియజేస్తున్నారన్నారు. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు మా ఆయన మచ్చలేని మనిషి చంద్రబాబు అని తెలిపారు. సంబంధం లేని విషయంలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేని చంద్రబాబుని అరెస్ట్ చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇదొక ఉద్దేశపూర్వకంగా చేసిన అరెస్టుగా ఒక ఉన్మాది చర్యగాతాము భావిస్తున్నామన్నారు. వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు.. ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో దాదాపు రెండున్నర లక్షల మంది ట్రైనింగ్ తీసుకుని 70000 మందికి పైగా ఉద్యోగాలు సంపాదించారని సాక్షాత్తు కోర్టు ఏ తెలియజేసిందన్నారు. దీనిపైన ప్రజాగ్రహాన్ని, నిజ నిరసనను ఎదుర్కొనడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉండాలని తెలిపారు. న్యాయస్థానాల ద్వారా న్యాయం కోసం పోరాటం చేస్తాం నిజ నిర్ధారణతో, నీతి నిజాయితీతో చంద్రబాబు బయటకు వస్తారని పేర్కొన్నారు. దాదాపు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 32 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే విధంగా జరుగుతుందన్నారు.
జగన్ కుట్ర చేస్తున్నారు : ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. ఎలాగైనా టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టాలనేదే జగన్ కుట్ర చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై హైకోర్టు కూడా జగన్‌కు మొట్టికాయ వేసిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 72 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయి తెలిపారు.
Purandeshwari Comments On Chandrababu Arrest : విధానాలు అనుసరించకుండా అరెస్టు : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును బీజేపీ ఖండించింది. సరైన నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబు అదుపులోకి తీసుకున్నారని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. వివరణ తీసుకోకుండా, విధానాలు అనుసరించకుండా అరెస్టు సరికాదుని ఆమె అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు కూడా పేర్కొనలేదని తెలిపారు.
టీడీపీ నేతలను నిర్బంధించటం దుర్మార్గం :చంద్రబాబు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులిచ్చి చర్యలు తీసుకోవచ్చు కదా అని అన్నారు. పోలీసులు అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. లోకేశ్ సహా టీడీపీ నేతలను నిర్బంధించటం దుర్మార్గం అని తెలిపారు.
Live Updates : తెలుగువారి ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: చంద్రబాబు
చంద్రబాబు అరెస్ట్‌ను సీపీఐ నేత నారాయణ :టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అరెస్ట్‌ను సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వ పాలన పరాకాష్ఠకు చేరిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే జగన్ సర్కారు చంద్రబాబును అరెస్ట్ చేసిందని నారాయణ విమర్శించారు. సుదీర్ఘ రాజీకీయ అనుభవమున్న వ్యక్తిని ఆధారాల్లేకుండా అరెస్ట్ చేసి.. తర్వాత ఆధారాలు చూపిస్తామంటున్నారంటే ఇంత బాధ్యాతారహితమైన ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు.
రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట :చంద్రబాబు నాయుడు అరెస్టు సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట అని PCC మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం, దుర్మార్గం, దౌర్జన్యమని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం :40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్న చంద్రబాబు నాయుడును తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని పరిటాల సునీత అన్నారు. లండన్‌లో ఉన్న సీఎం పోలీసులకు దిశా నిర్దేశం చేసి చంద్రబాబును అరెస్టు చేయించారన్నారు అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.