పేకాటరాయుళ్లపై గుంటూరు పోలీసుల కొరడా - పేకాట స్థావరంపై దాడులు..పట్టుబడ్డ జూదరులు
గుంటూరు నగరంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 25 మందికి పైగా పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు.
![పేకాటరాయుళ్లపై గుంటూరు పోలీసుల కొరడా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3600499-377-3600499-1560924250887.jpg)
పేకాట స్థావరంపై పోలీసుల కొరడా
పేకాట స్థావరంపై పోలీసుల కొరడా
గుంటూరులో పేకాట రాయుళ్ల భరతం పట్టారు.. అక్కడి పోలీసులు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు... నగర పరిధిలోని క్లబ్బులు, ప్రైవేటు అతిథి గృహాలపై దాడులు చేశారు. 25 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వారిని అరండల్ పేట పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. మరికొందరు ప్రముఖులు.. దాడుల గురించి తెలిసి తప్పించుకుని వెళ్లిపోయినట్లు సమాచారం.