గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్కు ఓ యువతిని.. పోలీసులు బెదిరించారు. తనకు ప్రభుత్వ ఇంటి స్థలం రాలేదని.. న్యాయం చేయాలంటూ శివశ్రీ.. పవన్ కల్యాణ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనను ఎందుకు కలిశావంటూ.. స్థానికంగా ఉన్న పార్టీ యువకులతో కలిసి పోలీసులు బెదిరించారని యువతి ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తాడేపల్లి పోలీసులు.. యువతిని స్టేషన్‌కు పిలిపించారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది.
పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందింది. అకారణంగా గొడవ చేస్తే ..కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిపింది. విచారణ పేరుతో సుమారు నాలుగు గంటలకుపైగా స్టేషన్ లో ఉంచారని బాధిత యువతి వాపోయింది.