గుంటూరు చుట్టుగుంట కూడలిలో పోలీసులు తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. ఇన్నోవా కారులో తరలిస్తుండగా మద్యాన్ని పట్టుకున్నామని నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి లక్ష 20 వేల రూపాయలు విలువ 480 మద్యం సీసాలను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
480 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత - చుట్టుగుంటలో తెలంగాణ మద్యం పట్టివేత వార్తలు
గుంటూరు నగరంలోని చుట్టుగుంట కూడలిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లక్ష 20 వేలు విలువ చేసే 480 సీసాల తెలంగాణ మద్యంను పోలీసులు పట్టుకున్నారు.
![480 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత police takeover telengana alcohol at chuttugunta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8411590-573-8411590-1597351179331.jpg)
చుట్టుగుంటలో తెలంగాణ మద్యం పట్టివేత