గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో 800 లీటర్ల బెల్లం ఊటను సత్తెనపల్లి ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు.
నాటుసారా విక్రయాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు.. అధికారులు దాడులు చేయగా.. బెల్లం ఊటను గుర్తించారు. ఇలాంటి చర్యలు సహించేది లేదని సీఐ మారయ్య హెచ్చరించారు.