ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder Case Solved: వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేయించిన భార్య - హత్య కేసును ఛేదించిన పోలీసులు

Police Solved the Murder Case in Guntur: ఈ నెల 1వ తేదీన గుంటూరులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో భార్యే ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Police Solved the Murder Case in Guntur
Police Solved the Murder Case in Guntur

By

Published : Jul 6, 2023, 10:23 AM IST

Updated : Jul 6, 2023, 10:21 PM IST

Police Solved the Murder Case in Guntur: భర్త మృతదేహాన్ని చూసి ఆ భార్య బోరున విలపించింది. తనతో పాటు పిల్లలకూ అన్యాయం జరిగిందంటూ గుండెలు బాదుకుంది. ఆయనను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అనుకోని విధంగా.. విచారణలో భర్తను హత్య చేయించింది ఆయన భార్యే అని పోలీసులు నిగ్గు తేల్చడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. గుంటూరులో జులై 1వ తేదీన జరిగిన పెయింటర్‌ బాషా హత్య కేసు మిస్టరీని నల్లపాడు పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలసి భర్తను భార్యే హత్య చేయించిందంటూ ముగ్గురు నిందితులను నిన్న అరెస్టు చేశారు.

సౌత్‌ డీఎస్పీ మెహబూబ్‌ బాషా బుధవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆయన సమాచారం మేరకు.. కృష్ణబాబు కాలనీకి చెందిన బాషా అలియాస్‌ అమీర్‌వలి లారీలకు పెయింటింగ్‌ వేసే పని చేస్తుంటారు. ఆయనకు షాహీనా అనే మహిళతో పది సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. షాహీనా అదే ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో పనులు చేస్తుంటుంది. అదే అపార్టుమెంట్‌లోని ఓ కారు డ్రైవర్​గా పని చేస్తున్న పాత గుంటూరుకు చెందిన షబ్బీర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా భర్తకు తెలియకుండా ఆరు నెలలుగా వ్యవహారం నడిపారు. అయితే తన భర్తను అడ్డుతొలగించుకుంటే పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఉండదని షబ్బీర్​కు చెప్పింది.

మద్యం తాగించి రాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి..:అందుకు సరేనన్న షబ్బీర్‌.. తన బంధువు, నల్లచెరువుకు చెందిన ఆటో డ్రైవర్‌ రఫీని రంగంలోకి దించాడు. షాహీనా, షబ్బీర్​, రఫీ.. కలిసి బాషాను హత్య చేయాలని పథకం రచించారు. అందుకు కొద్ది రోజులు ముందుగా రఫీతో ఒక కొత్త సిమ్‌ తీయించారు. షబ్బీర్‌ ఆ నంబరు నుంచి బాషాకు రఫీతో ఫోన్‌ చేయించి తాను అనేక లారీలకు ఓనర్​నని, వాటికి రంగులు వేసే పనులు ఇస్తానంటూ పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు బాషా, రఫీ కలిసి మద్యం తాగారు. ఆ పరిచయంతోనే ఈనెల 1న బాషాకు రఫీతో ఫోన్‌ చేయించి మద్యం తాగుదాం రమ్మంటూ ఏటుకూరు పొలాల వద్ద ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లారు.

బాషాకు బాగా మందు తాగించి మత్తులో ఉండగా షబ్బీర్‌, రఫీ కలిసి బైక్​కు ఉండే ఫోర్క్‌ రాడ్‌తో కొట్టి, అనంతరం కత్తితో పొడిచి చంపి పారిపోయారు. ఈ హత్యపై నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఘటనా స్థలిలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశాలతో డీఎస్పీ మెహబూబ్‌ బాషా ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసరావు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ కేసును ఛేదించారు. పోలీసులు మొదటి నుంచి బాషా భార్య షాహీనాపై కన్నేసి ఉంచారు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు బాషాకి వచ్చిన ఫోన్‌ కాల్స్‌, ఇతర సాంకేతిక ఆధారాలతో షబ్బీర్‌, రఫీతో కలిసి హతమార్చినట్లు నిగ్గుతేల్చారు. పరిజ్ఞానం ఆధారంగా ఏటుకూరు బైపాస్‌ వద్ద నిందితులు ఉన్నారనే సమాచారంతో సీఐతో పాటు ఎస్సై అశోక్‌, సిబ్బంది సుబ్బారావు, జాన్‌సైదా, పోతురాజు, వెంకటనారాయణ, మస్తాన్‌ అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేశారు. ఎస్పీ, డీఎస్పీలు వారిని అభినందించారు.

Last Updated : Jul 6, 2023, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details