గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో చర్చి ఫాదర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్లు పోస్ట్మార్టం నివేదికలో తేలిందన్నారు. ఒంటరితనం కారణంగా మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా కత్తితో పొడుచుకునేందుకు యత్నించి.. ధైర్యం చాలక ఉరి వేసుకుని మృతి చెందాడని పేర్కొన్నారు.
చర్చి ఫాదర్ కేసు: ఉరేసుకుని మృతి చెందినట్లు నిర్ధరణ - గుంటూరు జిల్లాలో చర్చి ఫాదర్ ఆత్మహత్య
గుంటూరు జిల్లా కొలకలూరులో చర్చి ఫాదర్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఉరేసుకుని మరణించినట్లు పోస్ట్మార్టం నివేదికలో తేలిందన్నారు.

చర్చి ఫాదర్ అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు