గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల నిందితురాలు ఆసియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోదరి ఇంటికి వెళ్లిన ఆమె.. తనకు వరుసకు కుమారుడైన బాబును అతి కిరాతకంగా పొట్టన పెట్టకుంది. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలి మానసిక స్థితిని పరిశీలించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. రెండు రోజులు పాటు వైద్యం అందించిన అనంతరం ఘటన గురించి విచారణ చేస్తామని చెప్పారు.
గుంటూరు ప్రభుత్వాసుపత్రికి లింగంగుంట్ల ఘటన నిందితురాలు - లింగంగుంట్ల ఘటన
సంచలనం సృష్టించిన లింగంగుంట్ల ఘటనలో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స నిమిత్తం ఆమెను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు ప్రభుత్వాసుపత్రికి లింగంగుంట్ల నిందితురాలు