ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల ప్రథమ వర్ధంతి కార్యక్రమాలకు పోలీసుల అభ్యంతరం

గుంటూరు జిల్లాలో బుధవారం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. కొవిడ్ దృష్ట్యా ఎలాంటి కార్యక్రమాలు చేయటానికి వీల్లేదని పోలీసులు.. కోడెల తనయుడు శివరాంకు నోటీసులు జారీ చేశారు.

కోడెల ప్రథమ వర్ధంతి వేడుకలకు పోలీసుల అనుమతి నిరాకరణ
కోడెల ప్రథమ వర్ధంతి వేడుకలకు పోలీసుల అనుమతి నిరాకరణ

By

Published : Sep 15, 2020, 3:37 PM IST

Updated : Sep 15, 2020, 5:30 PM IST

మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో బుధవారం పలు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కోడెల తనయుడు శివరాంకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొవిడ్ దృష్య్టా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలులేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు జారీ చేసిన నోటీసులపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబపరంగా జరిగే వర్ధంతి కార్యక్రమానికి నోటీసులు సరికాదన్నారు. యథావిధిగా కార్యక్రమాలు చేపడతామని శివరాం స్పష్టం చేశారు.

కోడెల ప్రథమ వర్ధంతికి పోలీసుల అనుమతి నిరాకరణ
Last Updated : Sep 15, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details